తొలకరి పలకరించి మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మృగశిర కార్తె నుంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు పొలంబాట పట్టారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్లోని రైతులు దుక్కులు దున్నుకొని, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను సిద్ధం చేసుకొని సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఫర్టిలైజర్ షాపులు రైతులతో కిటకిటలాడుతున్నాయి.
-యాచారం