తెలంగాణ సర్కార్ రైతుల అభ్యున్నతే ధ్యేయంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కేంద్రం అనుమతుల పేరిట అడ్డంకులు సృష్టిస్తూ కక్ష సాధిస్తున్నదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం బీజేపీ పాలిత రాష్ర్టాలను ఒకలా.. ఇతర పార్టీల పాలిత రాష్ర్టాలను మరోలా చూస్తున్నదన్నారు. డిస్కవరీ, బీబీసీ చానెళ్లు వరల్డ్స్ వండర్‌గా వర్ణించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో 16 నియోజకవర్గాల్లోని 1226 గ్రామాలకు సాగు నీరందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటుంటే.. పర్యావరణ అనుమతులివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో‘ పాలమూరు- రంగారెడ్డి’ ద్వారా ఉమ్మడి జిల్లాకు సాగునీటిని తెచ్చుకుంటామన్నారు.
షాబాద్, జూలై 15 : తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో చేవెళ్ల, వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. డిస్కవరీ, బీబీసీ చానళ్లు వరల్డ్ వండర్‌గా వర్ణించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నదన్నారు.
కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో వేరే ప్రభు త్వం అధికారంలో ఉంటే ప్రాజెక్టులకు అనుమతులిచ్చేందుకు కేంద్రానికి ఇంతా ఇబ్బంది అవుతుందా అని ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రా ష్ర్టానికి రావాల్సినవి అడుగుతున్నామన్నారు. మూడేండ్ల కాలంలోనే పూర్తి చేసుకుని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అయినా జాతీయ హో దా ఇస్తారెమోనని అనుకుంటే నాన్చుతున్నారని మండిపడ్డారు. గతంలో మహబూబ్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారానికి సుష్మాస్వరాజ్ వచ్చినప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కు కచ్చితంగా జాతీయ హోదా ఇస్తామని చెప్పారని.. అయితే బీజేపీ నాయకులు ఎన్నికల్లో గెలువకపోవడంతో వివక్ష, కక్షతోనే జాతీయ హోదా ఇవ్వడంలేదన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 16 నియోజకవర్గాల్లోని 1,226 గ్రామాల్లోని ప్రతి ఎకరానికీ సాగు నీరందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారన్నారు. ఇప్పటివరకు ఉదండపూర్ వరకు 95 శాతం పనులు పూర్తి కాగా.. అక్కడి నుంచి వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు నీరు తెచ్చుకుందామని చూస్తుంటే కేంద్రం కమిటీలతో ఆలస్యం చేస్తుండగా.. కాంగ్రెస్‌పార్టీ నాయకులు కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. పర్యావరణ పునరుద్ధరణ కోసం మేము చేసిన రిపోర్ట్ వారికి నచ్చకపోతే రూ.6,200 కోట్లతో రిపోర్ట్ చేశామని, దానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రణాళికలో తేడాలుండటంతోనే అనుమతులివ్వడంలేదని కేంద్రం చెబుతుందన్నారు. కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో ఎప్పటికీ మీ ప్ర భుత్వం అధికారంలోకి రాదని తేలిపోవడంతో నే ఈ ప్రాజెక్టును ఆపుతున్నారా అని ప్రశ్నించారు.
తెలంగాణలో పర్యావరణ అనుమతులను ఆపుతున్న కేంద్రం.. ఇటీవల కర్ణాటకలో ఎన్నికలు ఉండటంతో అప్పర్ భద్రపై ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నా వాటిని తుంగలో తొక్కి అప్పటికప్పుడే అనుమతులతోపాటు రూ. ఐదు వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసి జాతీయ హోదాను కల్పించిందన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో వారి ప్రభుత్వాలు అధికారం లో ఉండడంతో ఓ టైగర్ రిజర్వులోకి వెళ్లే ప్రాజెక్టుకు అనుమతులిచ్చారన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా పక్కన పెట్టిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లోపు పాలమూ రు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి జాతీయ హోదా కల్పించాలన్నారు.
రాష్ట్ర ప్రభు త్వం ఈ ప్రాజెక్టు పనులను రూ.60 కోట్లతో ప్రారంభించిందని, ఉదండపూర్ వరకు దాదాపు గా 95 శాతం పనులు పూర్తైనట్లు వివరించారు. ఉదండపూర్ నుంచి నీళ్లు ముందు ఉన్న పరిగి నియోజకవర్గానికి చేరుకుంటాయన్నారు. కక్ష సా ధింపు చర్యలతోనే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులతోపాటు జాతీయ హోదా ఇవ్వకుండా అడ్డుకోవడం సరైనది కాదని హితవు పలికారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని.. ఇక్క డ అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు.
కాళేశ్వరానికి కేంద్రం ఒక్క రూ పాయీ ఇవ్వలేదని, పాలమూరు-రంగారెడ్డికి కూడా ఒక్క రూపాయీ ఇవ్వకున్నా మేమే నిర్మించుకుంటామని స్పష్టం చేశారు. కానీ అనుమతులను మాత్రం త్వరగా మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మర్పల్లి మాలతి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కొంపల్లి అనంతరెడ్డి, చింతకింది నాగార్జునరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింహులు, మల్లారెడ్డి, నరేందర్‌గౌడ్, వెంకటేశ్, మహేశ్, కృష్ణ, సత్యనారాయణ, నరేందర్‌చారి పాల్గొన్నారు.
రైతులు పట్టించుకోరని కావాలనే జాప్యం..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తైతే తమను రైతులు పట్టించుకోరనే ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నది. కావాలనే దరఖాస్తులను రిజక్టు చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని.. తమ వైపు వచ్చేలా లేరనే కావాలనే పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, ప్రాజెక్టుకు జాతీ య హోదా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. అదేవిధంగా ఇటీవల ఉచిత విద్యుత్తు సరఫరాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ నినాదం మూడు పంటలైతే…రేవంత్‌రెడ్డి విధానం మూడు గంటలని… మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా.. మూడు పంటలను సాగు చేసుకునేలా చూసే బీఆర్ఎస్ ప్రభు త్వం కావాలా రైతులు నిర్ణయిచుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయాలని జత కట్టాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులందరూ సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్నారు. -మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే
ప్రాజెక్టును పూర్తి చేస్తాం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు వేసి అడుకుంటున్నా.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రాజెక్టు పను లు దాదాపుగా 95 శాతం వరకు పూర్తయ్యా యి. ఉదండాపూర్ నుంచి పరిగి ప్రాంతానికి నీరు వస్తున్నది. రూ.5600 కోట్లతో కాలువల నిర్మాణానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. పర్యావరణ అనుమతుల పేరుతో కేంద్రంలోని మో దీ ప్రభుత్వం కావాలనే పనులను ఆపుతున్న ది.
ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్‌కు వచ్చినప్పుడు పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆయన మాటను నిలబెట్టుకోలేదు. విభజన హామీల్లో ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన మాదిరిగానే తెలంగాణలోనూ కాళేశ్వ రం ప్రాజెక్టుకు ఇవ్వాలని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 4 లక్ష ల ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రాజెక్టు పనులు సాగకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు. ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు నీటిని అందిస్తాం
-కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణం. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో బలోపేతమవుతుండటంతో దానిని జీర్ణించుకోలేక ప్రాజెక్టు పనులను ఆ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. ప్రభుత్వం సొంత నిధులతో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తుంది. అనుమతులు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని కోరి అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం.
-కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే