కులకచర్ల, ఫిబ్రవరి 3: సమష్టి కృషితో గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం కులకచర్ల మండల సర్వసభ్యసమావేశం ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేసి గ్రామాల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తి స్థాయిలో అందే విధంగా అధికారులు కృషిచేయాలన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాలు పరిశుభ్రంగా మారయ్యాన్నారు. సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు హాజరు అయితేనే గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుస్తాయన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సభ్యులు పలు సందేహాలను సభలో తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్‌నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, వైస్ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, ఎంపీడీవో నాగవేణి, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. గురువారం కులకచర్ల మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో డీసీసీ బీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో సాల్వీడ్ గ్రామానికి చెందిన పీఏసీఎస్ సభ్యుడు కేతావత్గుండ్యనాయక్ మృతి చెందడంతో వారి కుటుంబానికి అంత్యక్రియల కోసం తొమ్మిదివేల రూపాయలను పీఏసీఎస్ ద్వారా అందజేశారు. కార్యక్రమంలో పీఏసీ ఎస్ వైస్‌చైర్మన్ నాగరాజు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, చౌడాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సీఈవో బక్కారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్య దర్శి లక్ష్మయ్య, మొగులయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్, మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రాంలాల్, పీఏసీఎస్ డైరెక్టర్ కొండయ్య పాల్గొన్నారు
కులకచర్ల మండల పరిధిలోని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయ సమీపంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక క్యాలెండర్‌ను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి సంఘం సభ్యులు, నాయకులు, ప్రజాప్రతి నిధులతో కలిసి ఆవిష్కరించారు.