మొయినాబాద్, జూలై 15 : రైతులకు అన్యాయం చేస్తే సహించబోమని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. కొన్నేండ్లుగా సాగుచేసుకుని జీవిస్తున్న భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకుని గోశాలకు ఇవ్వాలని ప్రభు త్వం భావించడం దారుణమని మండిపడ్డారు. మొయినాబాద్ మున్సిపాలిటీ, ఎన్కేపల్లిలోని ప్రభు త్వ భూమిని రైతులు గత 70 ఏండ్ల నుంచి సాగు చేసుకుని జీవిస్తుండగా.. ఆ భూమిని గోశాలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించడంతో దానిని వ్యతిరేకిస్తూ భూబాధితులు గత రెండు వారాలుగా ఆందోళన చేపడుతున్నారు.
కాగా, మంగళవారం బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి ఆధ్వర్యంలో రైతులు చేపడుతున్న ఆందోళనకు కార్తీక్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రైతులతో మా ట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. దళితులు సాగు చేసుకుంటున్న భూమిని గోశాలకు ఇవ్వాలని ప్రతిపాదించడం సరైనది కాదన్నారు. కోకాపేటలోని గోశాలను ఎన్కేపల్లికి తరలించి ఇక్కడి రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలని చూడడంపై మండిపడ్డారు.
అధికారంలోకి రాక ముందు అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పి.. ఇప్పుడేమో రైతులు సాగు చేసుకుంటున్న భూములను గుంజుకోవాలని చూడ డం తగదన్నారు. రైతులను ఒప్పించి, మెప్పించి భూములను తీసుకోవాలన్నారు. మెజార్టీ రైతులు ఓ వైపు ఆందోళన చేస్తుంటే మరోవైపు కొందరు రైతులను భయభ్రాంతులకు గురి చేసి అధికారులు పట్టాలివ్వడం తగదన్నారు. కొందరికి పట్టాలిచ్చి మరి కొందరికి ఇవ్వకుండా గ్రామాల్లో రైతుల మధ్య గొడవలు పెడుతారా..? అని ప్రశ్నించారు. ఏండ్ల తరబడిగా భూములను సాగు చేసుకుని జీవిస్తుండగా తమ భూములు పోతాయనే బాధతో.. ఆవేదనతో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆంజనేయులు, స్వప్నాసతీశ్, శ్రీహరియాదవ్, కోట్ల నరోత్తంరెడ్డి, ఎంఏ రవూఫ్, జగన్మోహన్రెడ్డి, నర్సింహగౌడ్, సుధాకర్‌యాదవ్, శ్రీనివాస్, రవియాదవ్, డప్పు రాజు, అంజయ్యగౌడ్, కృష్ణారెడ్డి, సురేందర్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రాంచందర్, లక్ష్మీనారాయణ, నవీన్‌కుమార్, పరమేశ్, ప్రవీణ్, రాము, శ్రీనివాస్, సుభాశ్, వెంకటేశ్, సురేశ్, శ్రీరాములు, దర్శన్, వెంకటేశ్‌యాదవ్, ప్రభాకర్‌రెడ్డి, రాంరెడ్డి, అలీం, షరీఫ్, సునీల్‌కుమార్, రాజుగౌడ్, సత్తిరెడ్డి, నర్సింహారెడ్డి, తిరుపతిరెడ్డి, సుధాకర్‌గౌడ్, సంజీవ, తదితరులు పాల్గొన్నారు.
కార్త్తీక్రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..
రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన తర్వాత కొంతమంది రైతులకు పట్టాలిస్తున్నారనే విషయం తెలుసుకున్న కార్తీక్‌రెడ్డి.. ఆర్డీవోను కలిసి మాట్లాడేందుకు రెవెన్యూ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు ఓవరాక్షన్ చేసి అడ్డుకున్నారు. ఎమ్మెల్యే యాదయ్య చేతుల మీదుగా మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు కొంతమంది రైతులకు పట్టాలను పంపిణీ చేస్తుండగా అటు వైపు వెళ్లనివ్వకపోవడంతో.. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది.
ఒకవైపు ఆందోళన చేస్తుంటే మరోవైపు పట్టాలను ఎలా ఇస్తారని రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు పొలాల నుంచి కార్తీక్‌రెడ్డితోపాటు వెళ్తున్న చాకలి బాలమ్మ మూతిపై మహిళా కానిస్టేబుల్ చేతితో గుద్దడంతో ఆమె పెదవి పగిలింది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ దాడి ఏమిటని ప్రశ్నించారు. కార్తీక్‌రెడ్డిని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొన్నది. అతడు కారులోకి ఎక్కిన తర్వాత ముందుకెళ్లకుండా పోలీసులు దానికి అడ్డుగా నిలబడ్డారు. సీఐ పవన్‌కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకుని పట్టాలిస్తున్న సమయంలో అక్కడికెళ్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పడంతో కార్తీక్‌రెడ్డి అక్కడికెళ్లలేదు.
రైతులకు న్యాయం చేయాలి : కార్తీక్‌రెడ్డి
మండల పరిషత్ కార్యాలయంలో ఏడుగురు రైతులకు పట్టాలిచ్చిన తర్వాత కార్తీక్‌రెడ్డి అక్కడికెళ్లారు. చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌ను కలిసి రైతులను ఎందుకు ఇలా విభజించి పట్టాలను పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులతో ఐదుసార్లు చర్చలు జరిపామని..ప్రభుత్వం నిర్ణయించిన
విధంగా హెచ్ఎండీఏ లేఅవుట్ చేసి ఎకరానికి 300 గజాల చొప్పున స్థలమిచ్చి వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లతోపాటు కబ్జాలో ఉన్న 50 కుటుంబాలకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఇస్తామని ఆర్డీవో చంద్రకళ వివరించారు. రైతులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.