మొయినాబాద్, ఫిబ్రవరి 5: కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, టియుఎఫ్ఐ డిసి చైర్మన్ చల్ల నరసింహారెడ్డి అన్నారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిలోని అసిస్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఇంచార్జ్ ఫామైన భీమ్ భరత్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ అంశంపై క్యాబినెట్ ఆమోదముద్ర తెలిపిందని అన్నారు. ఈ సమావేశంలో ముదిరాజ్.కార్పొరేషన్ చైర్మన్ బీ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ , సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి , మొయినాబాద్ మండల అధ్యక్షులు మాణయ్యా ,, మాజీ జడ్ పి టీ సి లు ,ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు అన్ని సంఘాల నాయకులు కార్యకర్తలు , మాజీ సర్పంచ్లు , మాజీ ఎం పి టి సి లు , యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.