స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశా రు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నదని మండిప డ్డారు. కాంగ్రెస్ పాలన నచ్చక చేవెళ్ల మం డలంలోని ముడిమ్యాల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, అలాగే, వికారాబాద్ మండలంలోని పులుమద్ది గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.

చేవెళ్ల రూరల్, నవంబర్ 28 : స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేలా సన్నద్ధం కావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నగరంలోని ఆమె నివాసంలో బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, ముడిమ్యాల్ మాజీ సర్పంచ్ స్వర్ణలతాదర్శన్, సీనియర్ నాయకుడు కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యం లో ముడిమ్యాల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ అయ్యిందని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను చెప్పాలన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో ముడిమ్యాల్ కాంగ్రెస్ నాయకులు సతీశ్, రాజు, ఖాజా మోయినుద్దీన్, నిరంజన్ తదితరులున్నారు.
వికారాబాద్ : కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చక పలువురు ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని.. బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పులుమద్ది గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు బాలమణితోపాటు భాగ్యమ్మ, లక్ష్మి, వీరమణి, శ్రీవాణి, శ్రీలత, పాపయ్య, శ్రీనివాస్, బీరయ్య, రవీందర్, గోపాల్, పాపయ్య, మల్లేశం, శ్రీనివాస్, రాజు, నరేశ్‌లు బీఆర్ఎస్లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల మైనార్టీ విభాగం అధ్యక్షుడు గయాజ్, మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్, నవంబర్ 28 : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపినిచ్చారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని చెన్నకేశవ ఫంక్షన్ హాల్లో మండలంలోని బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరం కృషి చేద్దామన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్పై విశ్వాసం ఉందని, కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలకు వివరించి చైతన్యపరిచి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాండూరు రూరల్ : తాండూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలువబోతున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కరణ్‌కోట, మల్కాపూర్, సంగంకలాన్ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యక ర్తలతో సమావేశమై మాట్లాడారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, శ్రీనివాసాచారి, రత్నాకర్, శ్రీనివాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.