వికారాబాద్, జనవరి 20: 13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర ధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని జరుపుకోవాలని, ఎపిక్ కార్డు కు ఆధార్ అనుసంధానం, ఫొటో సిమిలర్ ఎంట్రీ, ఎపిక్ కార్డుల పంపిణీపై చర్చించి తగు ఆదేశాలు జా రీ చేశారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ కరోనా కారణంగా గత రెండేండ్లుగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోలేకపోయామని.. ఈ సారి మాత్రం అన్ని జిల్లాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువను ప్రజలు తెలియజేయాలన్నారు.
జిల్లా కేంద్రాలతోపాటు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 25న జాతీయ ఓట ర్ల దినోత్సవాన్ని నిర్వహించి మొదటిసారి ఓటు హక్కు పొందిన వారికి ఎపిక్ కార్డులు అందజే సి సన్మానించాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదులో అత్యుత్తమ విధులు నిర్వ హించిన ఎన్నికల అధికారులకు అవార్డులు అందించాలన్నా రు. పోలింగ్ కేంద్రాలు, ఈఆర్వో కార్యాలయా ల్లో వాల్‌పోస్టర్లు ప్రదర్శించాలని, లోకల్ కేబుల్ నెట్‌వర్క్‌లలో వీడియోలు ప్రదర్శించాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా నూతనం గా నమోదైన ఓటర్లతోపాటు మిగతా ఓటర్లంద రి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం ఏప్రిల్ చివరిలోగా వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఇంటింటి సర్వే చేసి ఓటరు కార్డులో ఫొటోలు, పేర్లు సరిచేయడం, డబుల్ కార్డుల తొలగింపు, చిరునా మా సరిచేయడం తదితర మార్పులు,చేర్పులను వారం, పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
అనంతరం వికారాబాద్ కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో 68 శాతం ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం పూర్తైందని, రానున్న రోజుల్లో బీఎల్వోలవారీగా రూట్ మ్యాప్ తయారు చేసి త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్, ఎన్నికల డీటీ రవీందర్దత్తు తదితరులు పాల్గొన్నారు.