రంగారెడ్డి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఇంటింటి సర్వేకు తోడ్పాటు అందిస్తూ ఓటరు జాబితా పకాగా రూపొందేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూ చించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయ న పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 18 వరకు ప్రీ రివిజన్ ఆక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించి అక్టోబర్ 29న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రా ల వారీగా ఓటర్ల పేర్లను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎస్ఎస్ఆర్-2025లో భాగంగా బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో! లేదో? నిర్ధారించుకుంటారన్నారు. జనవరి 6న తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.
అవసరం ఉన్న చోట పోలింగ్ కేంద్రాలను విభజించడం, కొత్తవి ఏర్పాటు
చేయడం జరుగుతుందని.. అలాంటి పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తే వాటి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ ప్రక్రియ కోసం రాజకీయ పార్టీలన్నీ పోలింగ్ బూత్ల వారీగా ఏజెంట్లను ఏర్పా టు చేసుకోవాలని.. ఓటరు జాబితాలో ఏవైనా లోటుపాట్లుం టే సవరించుకోవచ్చునని తెలిపారు. సమావేశంలో డీఆర్వో సంగీత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు నాగార్జున, కాంగ్రెస్ నుంచి హరికృష్ణ, ధనుంజయ, బీఆర్ఎస్ నుంచి జగదీశ్, ఎం ఐఎం నుంచి మహ్మద్ తాహెర్, సీపీఎం నుంచి పగడాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.