పరిగి, జులై 06 : వరుస దోపిడీలకు పాల్పడుతున్న పరిగి తుంకులగడ్డకు చెందిన కావలి అనంతమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పరిగి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు. పరిగి బస్టాండ్ నందు వరుస దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా ఎస్ఐ సంతోష్ కుమార్ దృష్టి సారించారు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మహిళలు బస్టాండులో బస్సు ఎక్కుతున్న క్రమంలో గుర్తుతెలియని దొంగలు వృద్ధురాలి మెడలో బంగారు పట్టీలు, నల్ల పూసల పుస్తెలను దొంగలించారు.
బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ సీసీ కెమెరాలలోని దృశ్యాలను గుర్తించి నిందితురాలని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆమె దగ్గర నుంచి 16 బంగారు పట్టీలు, ఒక పుస్తెను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు గత ఏప్రిల్ నెల లో కోడంగల్ బస్టాండ్ లో దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పోలీసులు బాధితురాలిని విచారించగా గతంలో సైతం పరిగి బస్టాండ్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నది. నిందితురాలిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ తెలిపారు.