పరిగి : పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో వేద పండితులు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి ఆశీర్వచనాలు చేశారు. అనంతరం ఆయన తల్లిదండ్రులు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి-గిరిజాదేవిల ఆశీర్వాదం తీసుకొని వారితో కలిసి కేక్‌కట్ చేశారు. మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డిలు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పరిగిలోని బాలసదనంలో బాలికలకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి-ప్రతిమారెడ్డి దంపతులు బంగారు చెవి పోగులు అందజేశారు.
ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని పార్టీ నాయకులు గజమాలతో సన్మానించారు. అనంతరం తమ స్వగృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, హరిప్రియ, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ అంతిగారి సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్‌అలీ, సీనియర్ నాయకులు ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పరిగి మండలం నస్కల్ గ్రామంలో సర్పంచ్ మేడిద పద్మమ్మ, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్ల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి కేక్ కట్ చేశారు.