పరిగి : 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’ అనే వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరుకు సంబంధించిన అన్ని సేవలు, సదుపాయాలు ఓటర్లు తమ మొబైల్లో ఓటర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పొందాలని చెప్పారు. ఓటరుగా నమోదు కోసం, అసెంబ్లీ నియోజకవర్గం మారినప్పుడు ఫారం-6, చిరునామా మారితే ఫారం-8ఏ, సవరణలు ఉంటే ఫారం-8, జాబితాలో పేరు తొలగింపు కోసం ఫారం-7 ప్రకారం యాప్‌లో అప్డేట్, ధృవీకరణ చేసుకోవాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, స్వీప్ నోడల్ అధికారి కోటాజీ, కలెక్టరేట్ ఎలక్షన్ తాసిల్దార్ శ్రీధర్ పాల్గొన్నారు.