వికారాబాద్, నవంబర్ 19: వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న శ్రీ అనంతపదన్మాభస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి కల్యాణం కమనీయంగా, వైభవంగా జరిగింది. కార్తిక మాస పెద్ద జాతరను పురస్కరించుకుని ఆలయంలో ఈ నెల 14 నుంచి 29వ తేదీ వర కు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని జరిగిన స్వామి వారి కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
స్వామివారి కల్యాణానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కుటుంబసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వ చ్చిన భక్తులు ముం దు గా భగీరథ గుండంలో స్నానాలు ఆచరించి స్వా మివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. కోర్కెలు తీరిన భక్తులు కానుకల రూపంలో కోడె దూడలను ఆలయానికి సమర్పించారు. అదే విధంగా రాత్రి నిర్వహించిన రథోత్సవంలో భక్తులు అధిక సం ఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.