వికారాబాద్, జూన్ 29, (నమస్తే తెలంగాణ): నాల్గవ విడుత పల్లె ప్రగతి ప్రగతి, 3వ విడుత పట్టణ ప్రగతి,7వ విడుత హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు సన్న ద్ధం కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలు,మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్ లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు అధికారులతో జిల్లా కలెక్టరేట్ కార్యా లయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ హరిత తెలంగాణ కోసం అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లాకు ప్రతి నెల ప్రగతి కింద 566 గ్రామాలకు రూ.7కోట్ల 91లక్షలు నేరుగా గ్రామాలకు నిధులు వస్తున్నాయన్నారు. నేడు తెలం గాణ పల్లెలు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. జిల్లాలోని నాలుగు మున్సి పాలిటీలకు ప్రతి నెల రూ.1కోటి 60లక్షల నిధు లు మున్సిపాలిటీలకు నేరుగా జమ అవుతున్నాయని వెల్లడిం చారు. ప్రత్యేకంగా ఒక అదనపు కలెక్టర్‌ను స్థానిక సంస్థల కోసం ప్రభుత్వం నియమించిందన్నారు. పల్లెల లాగా పట్టణాలలో కూడా స్వచ్ఛతపై దృష్టి పెట్టాలన్నా రు. గతంలో వేసుకున్న వార్డు కమిటీలను పట్టణ ప్రగతి భాగ స్వామ్యం చేయాలని సూచించారు.
లైఅవుట్ల ఓపెన్ ఫ్లేస్లను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పేరుమీద రిజిస్ట్రేషన్లు చేసు కుని వాటిలో మొక్కలు నాటాలని పిలుపుని చ్చారు. ప్రభుత్వ కార్యాయాలను పరి శుభ్రం చేయాలి, పాత సామాగ్రి తదితరాలను తొలగిం చాలన్నారు. వికారాబాద్ జిల్లాను పల్లె ప్రగతిలో మొదటి స్థానంలో నిలబడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికి ఆరు చెట్లు ఇవ్వా లని,వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీ టీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్లు స్వయంగా వెళ్లి ఇంటింటికీ అందజేయాలన్నారు. పారిశుధ్యం, పచ్చదనం, నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాల పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జూలై ఒకటి నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వం నిర్ధేశించిన ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగాలన్నారు.
గ్రామాలభివృద్ధి కమిటీలను,కో-ఆప్షన్ సభ్యులు, గ్రామాల్లో,పట్టణాల్లో సీని యర్ సిటిజన్లను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయా లని సూచించారు. ప్రభుత్వ కార్యాయాలు, పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుప త్రులు, గ్రామ పంచాయతీ,మున్సిపల్ కార్యాయాలు,ఖాళీ ప్రదేశాలు,రైతు వేదికలు తదితర చోట్ల విరివిగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పౌసుమిబసు, వికారాబాద్, చేవెళ్ల, కొడంగల్, పరిగి ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్,కాలె యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి,కొప్పుల మహేశ్‌రెడ్డి, విద్యామౌలిక సదు పా యాల సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్ర య్య, సీఈవో జానకీరెడ్డి,డీపీవో రిజ్వానా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల తదిత రులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.. కాగా తాండూరు ఎమ్మెల్యే పైలాట్ రోహిత్‌రెడ్డి గూగుల్ మీట్ ద్వారా పాల్గొన్నారు.
‘ప్రగతి’ పనులతో అనూహ్య మార్పులు
షాబాద్, జూన్ 29: సీఎం కేసీఆర్ ప్రతి ష్టాత్మ కంగా ప్రారంభించిన పల్లె, పట్టణ ప్రగతి ద్వారా ఊహించని మార్పు కనిపిస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితారెడ్డి అన్నారు. మంగళ వారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని కోర్టు హాల్ నుంచి జూలై 1 నుంచి చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై మేయర్లు, మున్సిపల్ చైర్మ న్లు, కమిషనర్లు , జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పం చులు, ఎంపీటీసీలు, సంబంధిత అధికారులతో మంత్రి వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ రంగారెడ్డిజిల్లాలోని గ్రామ పంచాయతీలకు పల్లె ప్రగతిలో ప్రతి నెల రూ. 12.38కోట్లు, పట్టణ ప్రగతిలో రూ. 5.60కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి దేశం లోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను రోజు నిర్వహించి పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చెత్తా చెదారం లేకుండా శానిటేషన్ పనులు నిరంతరం చేపట్టాలని తెలిపారు. ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొని మొక్కలు నాటాలన్నారు. ఫ్రైవేట్ స్థలాల్లో చెత్తను తొలగించి అందుకు అయిన ఖర్చు సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేయాలని సూచించారు. శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడి కేంద్రా ల్లో, హెల్త్సెంటర్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్య పనులు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్ పనులకు సంబంధించి వంగిన, తుప్పు పట్టిన స్తం భాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని చెప్పారు. కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడు తూ…పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో పారి శుధ్య పనులు, విద్యుత్ సంబంధించి సమస్యలను పరిష్కరించి, జిల్లాను ప్రథ మ స్థానంలో ఉండేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఈ విడుత హరితహారంలో భాగంగా ప్రతి ఇం టికి ఆరు మొక్కల చొప్పున గ్రామాల్లో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయాలని, మున్సిపా లిటీల్లో కౌన్సిల ర్లు, కార్పొరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి మొక్కలు అందించాలని సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను భాగ స్వాములను చేయాలని తెలిపారు. అనంత రం 7వ విడత హరితహారం వాల్‌పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, డీఆర్డీవో పీడీ ప్రభాకర్‌రెడ్డి, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరా జ్యలక్ష్మి, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, పీఆర్ ఈఈ బన్సీలాల్ పాల్గొన్నారు.