వికారాబాద్, జూన్ 16: వికారాబాద్ మున్సిపల్ పరిధి లోని 2వ వార్డు ధన్నారంలో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను మున్సిపల్ చైర్పర్సన్ మంజుల గురువారం పరిశీలించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులుకు మున్సిపల్ చైర్పర్సన్ సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. ఆమె వెంట కమిషనర్ శరత్చంద్ర, ఏఈ రా యుడు, ప్రత్యేకాధికారులు ఉన్నారు.
అందరి సహకారంతో..
కులకచర్ల గ్రామ పంచాయతీలో వివిధ రకాల అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం కులకచర్ల గ్రామ పరిధిలో మొక్కలు నాటేదుకు రోడ్డుకు ఇరువైపులా గుంతలు తవ్వించారు. అనం తరం గ్రామంలో అండర్ డ్రైనేజీ పనులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ సౌమ్య, వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గ్రామాల రూపురేఖలు మారాయి
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని డీఎల్పీవో అనిత అన్నారు. మం డల పరిధిలోని బూచన్‌పల్లి, దామస్తాపూర్ తదితర గ్రామాలను సందర్శించి పల్లె ప్రగతి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా ఎన్నోఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమయాయన్నా రు. వర్షాకాలం సందర్భంగా ఇంటిపరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే నీరు నిల్వఉండకుండా చూ డాలని సూచించారు. ఆమె వెంట ఎంపీవో లక్ష్మీకాం త్, టీఆర్ఎస్ నాయకులు మధుకర్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు
కోట్‌పల్లిలో..
మండలంలోని ఇందోల్, ఓగ్లాపూర్, కొత్తపల్లి, రాంపూర్, లింగంపల్లి, కోట్‌పల్లి తదితర గ్రామాల్లో పరిశుభ్రత పనులు జోరుగా సాగుతున్నాయి. గురువారం ఆయా గ్రామాల్లో హరితహారం లో భాగంగా మొక్కలు నాటేందుకు గుంతలను తీశా రు. త్వరలోనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారం భిసామని మండల ఎంపీవో అన్నారు.