కులకచర్ల, జూన్ 6: పల్లె ప్రగతి కార్యక్రమంతో పుట్టపహాడ్ గ్రామం అభివృద్ధి పథంలో ముం దుకు దూసుకెళ్తున్నది. గతంలో గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుం డేవి. కానీ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు ప్రతినెలా నిధులను విడుదల చేస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, హరితహారం ద్వారా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. పల్లెప్రగతి ద్వారా కులకచర్ల మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టపహాడ్ గ్రామ రూపురేఖలు ఎంతో మారాయి. ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేస్తున్న నిధుల ను గ్రామస్తులు సద్వినియోగం చేసుకుంటు న్నారు. గ్రామ సర్పంచ్ స్థానికులకు అవసరమై న అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఇం టింటికీ కుళాయిలతో తాగునీటి సౌకర్యం, 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామంలో సీసీ రోడ్ల ఏర్పాటు, మురుగునీటి కాల్వల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులను చేపట్టారు. గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం ఏర్పాటు, మురుగునీటి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం, ఇంటింటికీ కుళాయిలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం వంటి పనులను చేపట్టారు. గ్రామంలో మురుగునీటి కాల్వలను నిర్మించి మురుగునీరు నిల్వ ఉండకుండా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి చర్యలు తీసుకుంటున్నారు.
పరిశు్రభ్రంగా పరిసరాలు..
పుట్టపహాడ్‌లో ఎక్కడ చూసినా పరిసరాలు పరిశుభ్రంగా కనిపిస్తు న్నాయి. నలుగురు పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ గ్రామంలో ఇంటింటికీ తిరిగి చెత్తాచెదారాన్ని సేకరించి ట్రాక్టర్ సహాయంతో కంపోస్టుషెడ్డుకు తరలించి అక్కడ ఎరువును తయారు చేస్తున్నారు. ఇంటింటికీ రెండు చొప్పున చెత్త బుట్టలను పంపిణీ చేయడంతో స్థానికులు చెత్తాచెదారాన్ని ఆ బుట్టల్లో వేస్తున్నారు. గ్రామంలో పూర్తిస్థాయిలో ఇంకుడు గుంతల నిర్మాణంకూడా పూర్తైంది. అంతేకాకుండా స్థానికులు మరుగుదొడ్లను నిర్మించు కుని వినియోగిస్తుండటంతో సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా మా రింది. ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయడంతో గ్రామం రాత్రివేళల్లో వెలుగులతో జిగేలుమంటున్నది.
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనాలు
పుట్టపహాడ్‌లో సర్పంచ్ అంజిలమ్మ ఆధ్వర్యంలో గ్రామంలో నాలుగు ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. అందులోని మొక్కలు ఏపుగా పెరిగి స్థానికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం
గ్రామస్తుల సహకారంతో పుట్టపహాడ్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుంచి ప్రతి నెలా వస్తున్న నిధుల తో అవసరమైన అన్ని రకాల అభివృద్ధి పనులను చేపడుతున్నాం. ఇప్పటికే 90 శా తం వరకు పనులను పూర్తి చేశాం. గ్రామా న్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. పల్లె ప్రకృతివనం, డం పింగ్ యార్డును ఏర్పాటు చేశాం. వైకుంఠధామం పనులు చివరి దశలో ఉన్నాయి.
– చిల్ల అంజిలమ్మ, సర్పంచ్, పుట్టపహాడ్ గ్రామ పంచాయతీ
పార్టీలకతీతంగా అభివృద్ధి
పుట్టపహాడ్‌లో పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగు తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను కేటాయిస్తున్నది. ఈ నిధులతో మౌలిక వసతులను కల్పించి గ్రామాన్ని మండలంలో నే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తి అయ్యాయి.
– రాజశేఖర్‌గౌడ్, వైస్ ఎంపీపీ, కులకచర్ల
ప్రజల సహకారంతో వనాల ఏర్పాటు
గ్రామంలో ప్రజల సహకారం తో నాలుగు ప్రాం తాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశాం. అందులో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. స్థానికులు ఉదయం, సాయంత్రం సమయాల్లో అక్కడ సేదతీరుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తు న్నాం. గ్రామాభివృద్ధికి సర్పంచ్, ప్రజాప్ర తినిధులు, వార్డు సభ్యులు, స్థానికులు సహకరిస్తున్నారు. – కవిత,
పంచాయతీ కార్యదర్శి, పుట్టపహాడ్
తడి, పొడి చెత్త సేకరణ
పుట్టపహాడ్‌లో పల్లె ప్రగతి ద్వారా వచ్చిన నిధులతో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. పంచాయతీ నిధులతో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ ఇండ్ల నుంచి సేకరించిన చెత్తాచెదా రాన్ని ఇక్కడికి తీసుకొచ్చి.. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. గతంలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవ డంతో దోమల బెడద ఉండేదని.. కానీ ప్రస్తుతం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో వీధులు, రోడ్లు శుభ్రంగా మారడంతో దోమల బెడద తప్పిందని పలువురు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరుగుదొడ్ల నిర్మాణం
పుట్టపహాడ్‌లో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని ప్రభుత్వం, అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో గ్రామంలో 30 రోజుల ప్రణాళిక కాలంలోనే ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకున్నారు. మలవిసర్జనకు బయటికి వెళ్లేవారికి రూ.500 ఫైన్ నిర్ణయించడంతో ఎవరు బయటకు వెళ్లకుండా ఉండేందుకు మరుగుదొడ్లను నిర్మించుకున్నారు.