చేవెళ్ల టౌన్, జూన్ 6 : బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. సోమవారం చేవెళ్ల అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ బండారి శైలజ, ఈసీడీఎస్ ఆధ్వర్యంలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ప్రవీణ, ఉమ, పంచాయతీ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ రాములు పాల్గొన్నారు.
బాకారంలో ర్యాలీ
మొయినాబాద్ : అంగన్వాడీల్లో పిల్లలను చేర్పించి వాటిని బలోపేతం చేయాలని సర్పంచ్ కొత్తపల్లి రాఘవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని బాకారం గ్రామంలో సోమవారం అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పిల్లలు, ప్రజాప్రతినిధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వనజ, నిర్మల, పంచాయతీ కార్యదర్శి తారాబాయి, నాయకులు మహేందర్, వినయ్‌రెడ్డి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల ఇంటింటా ప్రచారం
ఇబ్రహీంపట్నంరూరల్ : బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు వర్కాల పరమేశ్ అన్నారు.
కొనసాగుతున్న బడిబాట
మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఉపాధ్యాయులు సోమవారం ఇంటింటికీ తిరిగి పిల్లల తల్లిదండ్రులకు కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలోని వసతులు, నాణ్యమైన విద్య పట్ల ప్రజలకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.