వికారాబాద్ : ప్రతి మనిషి ఆరోగ్యాంగా ఉంటేనే జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం ఉదయం అనంతగిరిలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ మొదటిసారిగా నిర్వహించిన ట్రయిల్ రన్ కార్యక్రమంలో పాలొన్న కలెక్టర్.. మనిషి జీవితంలో ఆరోగ్యమే ప్రధానమని, దేశ శ్రేయస్సు ఆరోగ్యకరమైన జనాభాపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
అనంతగిరి అటవీ ప్రాంతం ఔషధ మొక్కలకు నిలయమని, ఇక్కడి గాలి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని, ఈ ప్రాంతంలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ట్రయల్ రన్ నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో 1000 మందికి పైగా తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు 5k, 10k, 20k, 32k రన్ నిర్వహించి పథకాలు బహుకరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అనంతగిరి ఎకో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎంట్రీ గేట్ బాగుందని ప్రశంసిస్తూ, పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, అడిషనల్ ఎస్పీ రాము నాయక్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.