మొయినాబాద్ : ప్రభుత్వ ఉద్యోగం కావాలి.. కాని ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడానికి సిద్ధపడారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఇష్టపడారు. అదే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసే వారు కూడా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. తమ పిల్లలను మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. కాని ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఓ ఉపాధ్యాయుడు మాత్రం తమ కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచాడు. మండల పరిధిలోని పెద్దమంగళారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న మహేందర్ తన కుమారుడు చేతన్‌ను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గుణాత్మక మార్పులతో కూడిన విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందించడంతో తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని ఉపాధ్యాయుడు మహేందర్ తెలిపాడు.