
వికారాబాద్, జూన్ 25, (నమస్తే తెలంగాణ): నాయీ బ్రాహ్మణులు, రజకులు ప్రభుత్వం కల్పిస్తున్న 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కాంప్లెక్స్‌లో నా యీ బ్రాహ్మణ, రజక సంఘాల నాయకులు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లు, సెలూన్ల నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయీ బ్రాహ్మ ణ, రజక ఫెడరేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో లాండ్రీ షాపులు, దోభీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇప్పటి వరకు జిల్లాలో 208 నాయీ బ్రా హ్మణులు, 89 మంది రజకులు మా త్రమే ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ నెల 30లోపు www.tsobmms.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆయా సంఘా ల నాయకులు లబ్ధిదారులకు అవగాహన కల్పిం చి, దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పెద్దాలాల్ రాములు, కులకచర్ల వెంకటేశ్, పరిగి ఆంజనేయులు, సి.రాములు, కొండయ్య, వెంకటేశం, నాయీ బ్రాహ్మణ సం ఘం నాయకులు అనంతయ్య, రవికుమార్, రాజు, శివశంకర్, బీసీ వెల్ఫేర్ కార్యాలయ సిబ్బంది సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.