కొడంగల్, మే 28: అన్ని పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ అసిస్టెంట్ల వివరాలు అందించాలని తాసిల్దార్ విజయకుమార్ ఆయా పార్టీల నాయకులకు సూచించారు. బుధవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ లెవెల్ అసిస్టెంట్ వివరాలు అందించాలని గత రెండు నెలలుగా కోరుతున్నామని కానీ, పార్టీల నాయకులు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో వివరాలు అందించారని కేవలం కొడంగల్ వెనుకబడి ఉందన్నారు. కాబట్టి పార్టీల నాయకులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని పార్టీల వారీగా బూత్ల అసిస్టెంట్ వివరాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు కృష్ణ యాదవ్, ఇందనూర్ బషీర్, బుస్సు చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.