వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నాసాన్ పల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..కోట్ పల్లి మండలం బర్వాద్ గ్రామానికి చెందిన చాకలి మల్లయ్య, దోమ పాండు ఇద్దరు కలిసి నాసాన్పల్లి చెరువులో 10వ తేదీ చేపలు పట్టడానికి వెళ్లారు. విషాద ఘటన చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువు నీటిలో మునిగి మృతి చెందారు. గ్రామ పరిధిలోని చెరువులో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.
గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చెరువులో విద్యుత్ మోటర్లు పెట్టి నీటిని పంటపోలాకు తరలిస్తున్నారని, విద్యుత్ సరఫరా కారణంగా షాక్ కు గురై మృతి చెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .