కులకచర్ల, ఆగస్టు 21 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు దాతలు ముందుకు వచ్చి టై, బెల్టులు అందజేయడం అభినందనీయమని కులకచర్ల మండల విద్యాధికారి అబీబ్ హైమద్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బీజేపీ మండల అధ్యక్షుడు గుడా వెంకటేశ్ విద్యార్థులకు టై, బెల్టులు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలంటే దాతలు సహకరించాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల చేత బోధన చేయడం జరుగుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన చాలా మంది విద్యార్థులు గొప్పస్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థులకు టై, బెల్టులు అందజేసిన గుడాల వెంకటేశ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, నాయకులు కాటన్పల్లి అంజిలయ్య, మహిపాల్, చంద్రలింగం, చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.