బంట్వారం , జనవరి 27 : వికారాబాద్ జిల్లా బంట్వారం మండల సరిహద్దులోని కుంచావరం గ్రామంలో గత మూడు రోజులుగా గ్రామ దేవతల జాతర అంగరంగ వైభవంగా కొనసాగింది. గ్రామంలో పెద్దమ్మ తల్లి, గాలిపోచమ్మ, ఊరడమ్మ తదితర దేవతలకు భోనాలను అర్పించి, భక్తులు నైవేద్యాలు సమర్పించారు.
మంగళవారం అధిక సంఖ్యలో భోనాలను ఊరడమ్మ దేతవకు సమర్పించారు. శివసత్తులు తమ నృత్యాలతో చూపరులను ఆకట్టుకున్నారు. అమ్మవారు భవిష్యవాణి వినిపించారు.గ్రామాన్ని చల్లంగా చూడాలని గ్రామస్తులు వేడుకున్నారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు.