ఎమ్మెల్యే కవ్వంపల్లికి నిరసన సెగ.. రైతుభరోసా ఇంకెప్పుడిస్తరు? వల్లంపట్లలో నిలదీసిన గ్రామస్తులు
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు శనివారం గ్రామానికి వచ్చారు.
- చెరువులు నింపాలని వినతి
- సమాధానం చెప్పకపోవడంతో ప్రజల్లో ఎమ్మెల్యేపై అసహనం
ఇల్లంతకుంట రూరల్, మార్చి 14: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు శనివారం గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన్ను పలు సమస్యలపై నిలదీశారు. గ్రామంలోని వందలాది మంది రైతులకు ఉపయోగపడే బతుకమ్మ చెరువును ఎందుకు నింపడంలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రూ.15 వేల రైతుభరోసా ఇస్తానని రేవంత్రెడ్డి అన్నాడు.. ఇప్పుడు నాలుగు సీజన్ల రైతుభరోసా ఇయ్యలేదు.. ఇంకెప్పుడిస్తారని నిలదీశారు. గ్రామంలో రెండేండ్ల క్రితం రూ.20 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం నిర్మిస్తే.. ఇంతవరకు ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కలెక్టర్ను అడగండి.. అంటూ ఎమ్మెల్యే సమాధానం చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

