బొంరాస్పేట, అక్టోబరు 16 : దవాఖానాకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని మహంతిపూర్ గ్రామ సమీపంలో ఈ నెల 10వ తేదీన ట్రాక్టర్ బోల్తా పడ్డ ప్రమాదంలో అబ్నవోని వెంకటయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి.
చికిత్స నిమిత్తం వెంకటయ్యను హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానాకు తరలించగా వెంట తల్లి లాలమ్మ(55) కూడా వెళ్లింది.
ఈ నెల 13వ తేదీన దవాఖానా నుంచి బయటకు వెళ్లిన లాలమ్మ తిరిగి రాలేదు. దీంతో ఆమె పెద్ద కొడుకు లాలయ్య ఉస్మానియా దవాఖానా పరిధిలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తప్పి పోయిన లాలమ్మ ఆచూకీ కోసం వెతుకుతున్నా లభించడం లేదని, ఆచూకీ తెలిసిన వారు 8186925713 నెంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని లాలయ్య తెలిపారు.