MLA Sabitha Reddy | ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చాలి : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
MLA Sabitha Reddy | ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని మాజీ మంత్రి. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Reddy) తెలిపారు.
కందుకూరు : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని మాజీ మంత్రి. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Reddy) తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ (KCR) దళిత బంధుతో పాటు మానస పుత్రికలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకున్నారని పేర్కొన్నారు. కందుకూరు వరకు మెట్రో తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.
ఫార్మాసిటీ(Pharmacity), మెట్రో (Metro) ను రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడం భావ్యం కాదని వెల్లడించారు. ఫార్మాసిటిని రద్దు చేస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన (Praja palana) లో ప్రజలు దరఖాస్తులను చేసుకోవాలని కోరారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను కడితే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు.
రైతు బంధు (Raitubandu) ను వేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 9వ తేదీ నుంచి రూ,15వేల వేస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయారని ఎద్దేవా చేశారు. అన్ని పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమని చెప్పి ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని అన్నారు. ఆరుగ్యారెంటీలతో పాటు 400 పథకాలకు హమీలు ఇచ్చారని వాటన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

