Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) మరో మైలురాయిని అధిగమించాడు. దశాబ్ద కాలానికి పైగా టీమిండియా విజయాల్లో కీలకమవుతున్న విరాట్.. అంతర్జాతీయ క్రికెట్లో పద్దెనిమిదేళ్లు పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా ఇదేరోజు.. 2008లో ఆగస్టు 18వ తేదీన శ్రీలంపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు కోహ్లీ. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునేదే లేకుండా సాగిన అతడి కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు, అబ్బురపరిచే విజయాలు, అపురూప శతకాలూ ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్లోకి ఎందరో ఆటగాళ్లు వచ్చిపోతుంటారు. కానీ, అతి కొద్ది మంది మ్రాతమే తమ పేరును చరిత్రలో లిఖించుకుంటారు. అలాంటి క్రికెటరే విరాట్ కోహ్లీ. అండర్ -19 వరల్డ్‌కప్ విజేతగా.. నూనుగు మీసాలో వయసులో భారత జట్టులో అడుగుపెట్టిన ఈ ఢిల్లీ కుర్రాడు రన్ మెషీన్‌గా అవతరించాడు.
A 19-year-old stepped onto the field in Dambulla, unaware that he was about to change cricket forever! 🙌
Here’s to 18 years of King Kohli inspiring millions to never, ever blink in the face of pressure! 💪#ViratKohli #VK18 #18yearsofVK pic.twitter.com/qt43YAJqFW
— Star Sports (@StarSportsIndia) August 18, 2026
తొలుత వన్డేల్లో 2008లో ఆగస్టు 18న శ్రీలంకపై అరంగేట్రం చేసిన విరాట్.. ఆపై మూడు ఫార్మాట్లలోనూ మొనగాడిలా నిలిచాడు. ఫ్యాబ్ 4లో ఒకడిగా కితాబులందుకున్న ఈ రన్ మెషీన్.. టన్నుల కొద్ది పరుగులు సాధించాడు. రికార్డు స్థాయిలో శతకాలతో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డులను బ్రేక్ చేస్తూ వచ్చిన విరాట్ అంర్జాతీయ క్రికెట్లో 18 వసంతాలు పూర్తి చేసుకున్నాడు.
కెరీర్ ఆరంభం నుంచి దూకుడైన మనస్తత్వంతో ఆకట్టుకున్న కోహ్లీ నమ్మదగ్గ బ్యాటర్‌గా ఎదిగాడు. క్రీజులో అతడు ఉన్నాడంటే చాలు.. హమ్మయ్యమనమే గెలుస్తాం అనే నిశ్చింత అభిమానుల్లో. వన్డేల్లో తీసుకుంటే.. ఏకంగా 64కు పైగా సగటుతో 28 సెంచరీలు కలిపి 8 వేల పరుగులు అతడి పేరిట ఉన్నాయి.
18 years ago, a 19-year-old Virat Kohli walked out with 𝟏𝟖 on his back. 💙
18 years later, the number needs no introduction. 👑
Watch #SLvIND, 1st Test | Day 4, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket… pic.twitter.com/2su0GpwFpR
— Sony Sports Network (@SonySportsNetwk) August 18, 2026
కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) భారత జట్టుకు దూకుడు నేర్పితే.. అతడిని మించిన పౌరుషాగ్నిలా ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించాడు విరాట్. అతడి సారథ్యంలో టీమిండియా కసిగా ఆడింది. ఆస్ట్రేలియా గడ్డపై విక్టరీలతో.. టెస్టుల్లో అజేయ శక్తిలా దూసుకెళ్లింది. వ్యక్తిగతంగా 85 శతకాలు, అత్యధిక హాఫ్ సెంచరీలు, ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డుల రారాజుగా పేరొందాడు.
ఐసీసీ ట్రోఫీల విషయానికొస్తే.. 2011 వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్ విజేతైన కోహ్లీ తన సుదీర్ఘ కెరీర్లో ఒక్క టెస్టు గద తప్ప దాదాపు అన్నీ సాధించాడు. రెండేళ్ల క్రితం పొట్టి ఫార్మాట్‌కు.. నిరుడు టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్.. వన్డేల్లోనే కొనసాగుతున్నాడు.

వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడాలనుకుంటున్న అతడు.. ప్రతి సిరీస్‌లో రాణిస్తూ వయసు తనకు అంకె మాత్రమే అని సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. మొత్తంగా ఇప్పటివరకూ మూడు ఫార్మట్‌లో 28 వేలకు పైగా రన్స్ (టెస్టుల్లో 9,230.. వన్డేల్లో 15,000, టీ20ల్లో 4,188) బాదేశాడీ క్రికెట్ శిఖరం.