కులకచర్ల, జూన్ 16 : పౌష్టికాహారం తీసుకోవడం వల్ల టీబి వ్యాధిని నియంత్రణ చేయవచ్చని కుల్కచర్ల డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ పేసెంట్లకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాకర్ట్ కిరణ్కుమార్ మాట్లాడుతూ.. టీబీ బారిన పడిన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా టీబి వ్యాధిని నయం చేయవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ఐదుగురు టీబీ పేషెంట్లకు హెల్త్ అసిస్టెంట్ హకీంపేట్ శ్రీనివాసరావు న్యూట్రిషన్ కిట్లను స్వయంగా ముందుకు వచ్చి అందించారు.