మర్పల్లి, నవంబర్ 17 : నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన విద్య బోధన చేయాలని అందించాలని మండల ప్రత్యేక అధివిద్యార్థులకుకారి మోహనకృష్ణ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో మర్పల్లి పాటు కోటమర్పల్లి పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో జయరామ్, ఎంఈవో అంజిలయ్యతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనానికి వాడే బియ్యాన్ని పరిశీలించారు.
అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు వడ్డించిన కోడిగుడ్లను పరిశీలించగా వాటిల్లో ఉండే పచ్చసొన నలుపు రంగులో ఉన్నాయని వాటిని పిల్లలకు ఇవ్వకూడదని, వాటి వల్ల అరోగ్య సమస్యలు వస్తాయన్నారు. పాఠశాలలోని మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా? అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కల్ఖోడా కాంప్లెంక్స్లోని పాఠశాలలను తహసీల్దార్ పురుషోత్తం పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా మెరుగైన విద్య బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.