కులకచర్ల, జనవరి 19 : ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కులకచర్ల ఎస్ఐ రమేశ్‌కుమార్ అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేంద్రంలో రోడ్డు భద్రతావారోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించి వాహనాలను నడపాలని అన్నారు. వాహనందారులు ట్రాఫిక్ రూల్స్‌ను తప్పని సరిగా పాటించాలని సూచించారు.
నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే చర్యలు తప్పని తెలిపారు. వాహనందారులు సీట్‌బెల్టులను ధరించాలని, ద్విచక్రవాహనందారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. మధ్యం సేవించి వాహనాలను నడిపితే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల మార్కెట్ కమిటి చైర్మన్ బీఎస్ ఆంజనేయులు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ భీంరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్యగౌడ్, స్థానికులు పాల్గొన్నారు.