దోమ,నవంబర్ 06 : కేఎస్ఆర్ ట్రస్ట్ బాధితులకు అండగా నిలిచి ఆదుకుంటుందన్ని కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్‌కు మార్రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ గ్రామానికి చెందిన మాణిక్య మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్‌కుమార్‌రెడ్డి గురువారం ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పర్థితులను అడిగి తెలుసుకొని ప్రతి నెల మందులు కొనేందుకు డబ్బులు అందజేస్తానని తెలిపారు.
అనంతరం మండల పరిధిలోని బొంపల్లి గ్రామానికి చెందిన ముద్దం శ్రీనివాస్ యాదవ్ ఆనారోగ్యంతో బాధపడుతున్నాడనే విషయాన్ని తెలుసుకున్న శరత్‌కుమార్‌రెడ్డి అతన్ని పరమార్శించి శ్రీనివాస్‌కు ఫిజియోతెరపి కోసం ఆర్థిక సాయం అందజేసి ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో లింగయ్య, వెంకట్రాములు, మల్లేష్‌యాదవ్, మహేందర్, రాములు, వేణు, విజయ్‌వర్దన్ బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.