– నల్లగొండ 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లివేణు యాదవ్
నీలగిరి, ఫిబ్రవరి 09 : సేవ చేస్తూ, మీలో ఒకడిగా ఉంటూ గాంధీనగర్ అభివృద్ధికి పాటుకుడుతున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లివేణు యాదవ్ ఓటర్లను కోరారు. సోమళవారం 39వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్‌లో కార్యకర్తలతో కలిసి ఇంటింటి శ్రప్రచారం నిర్వహించారు. నల్లగొండ పట్టణాన్ని గాంధీనగర్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. నల్లగొండ పట్టణాన్ని బీఆర్ఎస్ రూ.1,300 కోట్లతో అభివృద్ధి చేసిందన్నారు. నాడు చేసిన అభివృద్ధి కారణంగా నేడు మున్సిపాలిటీ కాస్తా కార్పోరేషన్‌గా మారిందన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఐదుసార్లు గెలిచి మంత్రిగా రేండేళ్ల నుండి చేసిందేమి లేదన్నారు.
గత ఐదు పర్యాయాలుగా గాంధీనగర్ లో కాంగ్రసకు చోటు లేదన్నారు. కానీ ప్రస్తుతం అధికార కాంగ్రెస్ డబ్బు సంచులతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వస్తున్నారని అన్నారు. మీలో ఒకడిగా ఉంటూ మీముందు ఉంటున్న తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మెరుగు గోపి, బీఆర్ఎస్ సీనియర్ నేత బక్కా పిచ్చయ్యతో బీఆర్ఎస్, సీపీఎం నాయకులు మామిడి పద్మ విజయలక్ష్మీ, జలందర్, కేమన్రావు, సత్యనారాయణ, ప్రసన్న, అల్లి సోమశేఖర్ పాల్గొన్నారు.