ZIM vs OMA : పొట్టి ప్రపంచకప్ తొలి పోరులో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఒమన్ బ్యాటర్లను వణికిస్తూ బ్లెస్సింగ్ ముజరబని(3-16), బ్రాడ్ ఎవాన్స్(3-18), రిచర్డ్ ఎగర్వ(3-17)లు వికెట్ల పండుగ చేసుకున్నారు. ముజరబని, ఎన్వగరలు టాపార్డర్‌ను పడగొట్టగా.. డెత్ ఓవర్లలో ఎవాన్స్ రెచ్చిపోయాడు. శుభారంభం లభించకపోవడంతో ఒమన్ ఆటగాళ్లు క్రీజులో నిలిచేందుకు అపసోపాలు పడ్డారు. సూఫియన్ మొహమూద్(25), వినాకయక్ శుక్లా(28)లు సూ పోరాటంతో వంద రన్స్ చేసిన ఒమన్.. మరో బంతి మిగిలి ఉండగానే ఆలౌటయ్యింది.
వరల్డ్‌కప్‌లో చిన్న జట్లు సంచలన ప్రదర్శన చేస్తుండగా.. ఒమన్ బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ఆరంభ పోరులో జింబాబ్వే బౌలర్ల ధాటికి క్రీజులో నిలువలేక పెవిలియన్ చేరారు. ఓపెనర్లు అమీర్ ఖలీమ్(5), జతిందర్ సింగ్(5)లను ఔట్ చేసి షాకిచ్చిన ముజరబని.. అదే ఊపులో కరన్ సొనవాలే(0)ను సాగనంపాడు. అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే హమ్మద్ మిర్జా(0)ను డకౌట్‌గా నగరవ వెనక్కి పంపాడు. కాసేపటికే సికిందర్ రజా ఓవర్లో వసీమ్ అలీ(3) సైతం ఔటవ్వగా.. 27 పరుగులకే సగం వికెట్లు పడ్డాయి. జింబాబ్వే బౌలర్లు పోటీపడి వికెట్లు తీయగా ఒమన్ 60-70లోపే కుప్పకూలేలా కనిపించింది.
Vinayak Shukla finds the gap behind square and beats the diving fielder to the fence. 🙌 Oman fight back with intent. 💪
ICC Men’s #T20WorldCup | #ZIMvOMA | LIVE NOW 👉 https://t.co/sSkJZZDHu0 pic.twitter.com/LaI8WRhOnx
— Star Sports (@StarSportsIndia) February 9, 2026
నిప్పులు చెరుగుతున్న జింబాబ్వే పేసర్లను కాచుకొని క్రీజులో నిలిచిన సూఫియాన్ మెహమూద్(25), వినాయక్ శుక్లా(28)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరో వికెట్‌కు 42 పరుగులు జోడించిన ఈ ద్వయాన్ని నగరన విడదీయగా.. లోయర్ ఆర్డర్లో నదీమ్ ఖాన్(20) బ్యాట్ ఝులిపించాడు. కానీ, ఎవాన్స్ ఓవర్లో షకీల్ అహ్మద్ బౌల్డ్ కావడంతో 103కే ఒమన్ ఆలౌటయ్యింది. ప్రపంచకప్‌లో జింబాబ్వేపై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోర్.