Avesham 2 | తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న మాలీవుడ్ స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). ఈ క్రేజీ యాక్టర్ నటించిన మాలీవుడ్ యాక్షన్ కామెడీ డ్రామా ఆవేశం (Avesham).రోమాంచం ఫేం జీతూ మాధవన్ డైరెక్ట్ చేశాడు. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ పోషించిన రంగ పాత్రకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.
కాగా ఈ క్రేజీ చిత్రానికి సీక్వెల్ రాబోతుందన్న వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. తాజాగా ఓ ఈవెంట్లో సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు ఫహద్ ఫాసిల్. ఆవేశం 2 ఉంటుందని అధికారికంగా ప్రకటించాడు. సీక్వెల్ 2027 లేదా 2028లో మొదలు కానుందని కూడా క్లారిటీ ఇచ్చాడు. డైరెక్టర్ జీతూ మాధవన్ సూర్యతో చేస్తున్న తన తొలి తమిళ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీతోపాటు ఫహద్ ఫాసిల్ కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత ఆవేశం 2 సెట్స్‌పైకి వెళ్లనుందట. మొత్తానికి పుష్ప యాక్టర్ అభిమానులు, మూవీ లవర్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఓ వైపు ఫహద్ ఫాసిల్ అండ్ టీం కామిక్ టైమింగ్.. మరో యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ఆవేశం చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఆవేశం 2 అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఆవేశం చిత్రాన్ని ఫహద్ ఫాసిల్-నజ్రియా నజీమ్, అనన్ర్ రషీద్ సంయుక్తంగా నిర్మించారు.
Supritha | మా అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుంది … సుప్రిత ఎమోషనల్ కామెంట్స్ వైరల్