మర్పల్లి, అక్టోబర్ 5 : స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత అధిక సంఖ్యలో పోటీ చేయాలని తెంలగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి రవికుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు బకాయలు చెల్లించక, స్కాలర్షిప్స్ ఇవ్వలేక 14 లక్షల మంది విద్యార్థుల అర్తనాదాలు ప్రభుత్వనికి తెలియాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోటీ చేయాలని పిలుపునిచ్చారు.
ఫీజు బకాయలు చెల్లించక పోవడంతో విద్యార్థలు అష్ట కష్టాల పాలవుతున్నారని, ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చిన వారు అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటు న్నారని తెలిపారు. కొందరు సర్టిఫికెట్లు తీసుకోలేక ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయలు చెల్లించాలని డింమాండ్ చేశారు.