వికారాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న వ్యాపారాలపై పోలీసు యంత్రాం గం ఉక్కుపాదం మోపుతున్నది. నిఘాను పటి ష్టం చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలను ముమ్మరం చేసింది. వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆరు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా లో విత్తనాలు, కల్తీ టీ పొడి, అల్లం పేస్ట్, పాలు తదితర ఆహార పదార్థాలు కల్తీ కాకుండా చర్య లు తీసుకుంటున్నారు. ఎక్కడైనా కల్తీ జరుగుతు న్నట్లు సమాచారం అందితే టాస్క్‌ఫోర్స్ బృం దాలు అక్కడికెళ్లి దాడులు చేసి సామగ్రిని స్వాధీ నం చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల పీడీఎస్ బియ్యాన్ని సేకరించిన అక్రమార్కులు సన్న బియ్యంగా మార్చుతూ మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించిన 96 మందిపై కేసులు నమోదు చేసి 193 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీ నం చేసుకున్నారు. కొందరు అక్రమార్కులు డీలర్లతో కుమ్మక్కై రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు బియ్యాన్ని తరలిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
అనుమతిలేని కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా…
జిల్లాలో ఎలాంటి అనుమతుల్లేకుండా కొనసాగుతు న్న అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక దృష్టిని సారించడం జరిగింది. కల్తీ టీ పొడి, అల్లం పేస్ట్, పాలు తదితర ఆహార పదార్థాలు కల్తీ కాకుండా చర్యలు తీసుకుంటు న్నాం. ఇందుకోసం జిల్లాలో ఆరు టాస్క్‌ఫోర్స్ బృం దాలను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 193 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు 96 మం దిపై కేసులు నమోదు చేశాం. 19 క్వింటాళ్ల కల్తీ టీ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నాం.
– కోటిరెడ్డి, వికారాబాద్ ఎస్పీ
రాజమండ్రి నుంచి కల్తీ టీ పొడి..
జిల్లాలోని మార్కెట్లలో కల్తీ టీ పొడి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో అధిక మొత్తంలో కల్తీ టీ పొ డిని విక్రయిస్తున్నట్లు జిల్లా టాస్క్‌ఫోర్స్ బృం దాలు తేల్చాయి. కల్తీ టీ పొడి తయారీకి అవసరమయ్యే ముడిసరుకును ఏపీలోని రాజమండ్రి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నట్లు, అంతేకాకుం డా అస్సాంలో నాసిరకం ముడి సరుకును జిల్లా కు తీసుకొచ్చి టీ పొడిని తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందా లు ఇటీవల కోట్‌పల్లి మండల కేంద్రంలో తనిఖీలు చేపట్టి 19 క్వింటాళ్ల కల్తీ టీ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు..
కల్తీ అల్లం పేస్ట్ దందా జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఫంక్షన్ హాళ్లలో వంట చేసే ఆర్డర్ తీసుకునే వారితో అక్రమార్కులు కుమ్మక్కై కల్తీ అల్లం పేస్ట్‌ను ఆహార పదార్థాల్లో వినియోగిస్తున్నారు. యాసిడ్, కెమికల్స్ తదితర వస్తువులతో తయారయ్యే కల్తీ అల్లం పేస్ట్‌ను ఎవరికి అనుమానం రాకుండా బర్త్ డే పార్టీలు, విందులు తదితర కార్యక్రమాల్లో వినియోగిస్తున్నట్లు కల్తీ అల్లం పేస్ట్‌తో ఇటీవల పట్టుబడిన నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. అంతేకాకుండా రోడ్డు పక్క న ఉండే ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలోనూ ఈ పేస్ట్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇటీవల కల్తీ అల్లం పేస్ట్‌తో పట్టుబడిన వ్యక్తిని విచారించగా, రాజేంద్రనగర్ మండలంలోని మైలార్‌దేవ్‌పల్లిలో తయారయ్యే కల్తీ అల్లం పేస్ట్‌ను అక్కడి నుంచి వికారాబాద్ జిల్లాకు తరలించి విక్రయిస్తున్నట్లు తెలిపాడు. దీంతో టాస్క్‌ఫోర్స్ బృం దం సభ్యులు మైలార్‌దేవ్‌పల్లిలో తనిఖీలు చేసి 16 డ్రమ్ముల కల్తీ అల్లం పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ అల్లం పేస్ట్‌ను జిల్లాలో ఉన్న ఫం క్షన్ హాళ్లను లక్ష్యంగా చేసుకుని అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో జిల్లాలోని తాండూరు పట్టణ కేంద్రంగా నిర్వహించిన కల్తీ అల్లం పేస్ట్ గుట్టును టాస్క్‌ఫోర్స్ బృందం రట్టు చేసింది.