ధారూరు, మే 12: పల్లెలో పారుశుద్ధ్య సమస్య (Drainage Issue) పరిష్కరించే నాథుడే లేడు. గ్రామంలో మురుగు కాలువలకు మోక్షం లేదు. పంచాయతీలో కార్మికులు లేక ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. పల్లెలో మురుగు నీరు ఏరులైపారుతుంది. గ్రామంలో ఎక్కడ చూసిన పారుశుద్ధ్యం అస్తవస్త్యంగా మారుతుంది. కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు పనులు చేయడానికి ముందుకురావడం లేదు. దీంతో గ్రామంలో పారుశుద్ధ్యం లోపిస్తుంది. ఇందుకు తాజా నిదర్శనం మండల పరిధిలోని రాజాపూర్ గ్రామ పంచాయతిలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో గ్రామంలో సమస్యలు ఎక్కువగా నెలకోన్నాయి. గ్రామంలో ఉన్న సమస్యలతో పంచాయతీ కార్యదర్శికి తెలిపిన ఫలితం లేకపోయింది. పల్లె చిన్నది.. సమస్యలు పెద్దవి అన్నట్టుగా ఉందని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసిన పారుశద్ధ్యం అస్తవస్త్యంగా ఉందని, ప్రజ ప్రతి నిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కంపు కొడుతున్న మురుగు
గ్రామంలోని ప్రధాన వీదిలల్లో మురుగు కాలువ ప్రవహిస్తున్న దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. చినుకు పడితే చాలు మురుగు నీరు ఇడ్లలోకి చేరుతుంది. సుమారు 15, 20 ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీరంతా ఇదే కాలువలో చేరుతుంది. దీంతో కాలువ నిర్మాణం లేకపోవడం వల్ల ఎక్కడపడితే అక్కడ మురుగు నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతుంది. అయితే దీన్ని నెలకోసారైన శుభ్రం చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇదే మురుగు నీరు ప్రధాన రోడ్డు గుండ వెళ్తుంది.ఇక్కడ ఉన్న 20 కుటుంబాలు ఇక్కడే నివసిస్తున్న వారికి దుర్వాసనతో ఉండలేక పోతున్నారు. వారితోపాటు పిల్లలు పెద్దలు వారంత ఇదే దుర్వాసనను భరిస్తూ ఉంటారు. ఇంతటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ మురుగు కాలువ నిర్మాణాన్ని చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని వాపోతున్నారు. ఇప్పటికైన కాలువను సీసీ డ్రైనేజీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
కేనాల్ నీటిలో డ్రైనేజిని కలుపడంతో..
గ్రామంలో నుండి వేళ్లుతున్న లక్నాపూర్ కేనాల్ నీరు ప్రవహించడంతో గ్రామంలోని కొత్తగా నిర్మించిన ఇంట్టి వారు వారికి ఇంకుడు గుంతలలో నీరు ఇంకాకపోవడంతో డ్రైనేజీ నుండి వచ్చే మురికి నీరు, డ్రైనేజి కేనాల్లో కలవడంతో మురుగు వాసన వేదజల్లుతుంది.కేనాల్ గ్రామం మధ్యలో ఉండడంతో దుర్వాసన వేదజల్లడంతో కేనాల్ పక్కన ఉన్న కుటుంబాల ప్రజలు ఉండలేక పోతున్నారు.అధికారులు ఈ దుర్వాసన ను దృష్టిలో ఉంచుకోని కేనాల్ నీటిలో డ్రైనేజి నీరు కలువకుండా చూడాలని కోరారు.
ప్రజా ప్రతినిధులు లేకనే పల్లె అస్తవస్త్యం అవుతుంది..
ప్రజా ప్రతినిధులు లేకనే గ్రామంలో పారుశుద్ధ్యం అస్తవస్త్యంగా మారిందని శ్రీశైలం అనే వ్యక్తి చెప్పారు. ప్రజాప్రతినిధులు ఉంటే గ్రామం అభివృద్ధి జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాలు అస్తవస్త్యంగా మారుతున్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ధి జరగడం కష్టంగా ఉంది. ప్రత్యేక అధికారులు వారి పనులను చూసుకోని వారికి ఇచ్చిన 4, 5 గ్రామాలను కూడా చూడాలంటే కష్టం కాబట్టి ప్రభుత్వం త్వరగా ఎన్నికలు నిర్వహించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలి. గ్రామంలో సర్పంచ్ ఉంటే ప్రజలు వారికి ఉన్న సమస్యలను సర్పంచ్‌కు తెలిపి వారి సమస్యలను పరిష్కారించుకుంటారు.
దుర్వాసనను భరించ లేక పోతున్నాము..
ఇంటి చుట్టూ ఉన్న మురుగు కాలువలు ఉండడంతో వాటి ద్వారా వచ్చే దుర్వసానను భరించలేక పోతున్నామని గ్రామానికి చెందిన ఆగమయ్య చెప్పారు. ఊరు మధ్యలో ఉన్న కాలువ నీటిలో డ్రైనేజీ కలపడంతో దుర్వాసన వేదజల్లుతుంది. దుర్వాసన భరించలేక అధికారుల దృష్టికి తీసుకువేళ్లాం. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అన్నం తిందమంటే దుర్వసానకు తినేకపోతున్నాం. అధికారులు వేంటనే స్పందించి మాసమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నాం. మురుగు కాలువల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నాం.