తాండూర్ రూరల్, జూన్ 29 : కులం పేరుతో దూషించిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి ఆర్. వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఆదివారం తాండూరు మండలం చేనిగేషే పూర్, బెల్క టూర్, గ్రామాల్లోని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కులాలపై దాడులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు ఈ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా సమస్య తీవ్రతరం కాకముందే బాధితులకు న్యాయం చేసే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాస్, మల్కయ్య, మహిపాల్, బుగ్గయ్య, తదితరులు ఉన్నారు.