వికారాబాద్, జూన్ 15 : బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని బీసీ భవన్లో వికారాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ పార్టీలపరంగా రిజర్వేషన్ ఇస్తామంటే బీసీలను మోసగించడమేనని అన్నారు. బీసీల సంఖ్యకు అనుగుణంగా సీట్లు కేటాయించాలన్నారు. వెనుకబడిన బీసీల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
జనాభాలో 50% పైగా బీసీ లు ఉన్న రిజర్వేషన్లు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో బీసీలకు రావాల్సిన వాటాను పక్కాగా అమలు చేయాలని తెలిపారు. అనంతరం ఆర్ కృష్ణయ్యను నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగి మల్లేష్ యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి రవి యాదవ్, బీసీ వికారాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సాయిలు, వికారాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.