వికారాబాద్, ఏప్రిల్ 28 : ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఏపీ కళాశాల, ఆయా కళాశాలల విద్యార్థులతో కలిసి పెండింగ్లో ఉన్న ఫీజ్ రియంబర్స్ మెంట్ విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్వర్వులు ఇవ్వాలని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టు కార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో రోజులు ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజ్ రియంబర్స్ మెంట్ను ప్రభుత్వం మంజూరు చేసే విధంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్వీ చేస్తున్న పోరాటానికి మద్ధతుగా విద్యార్థులు నిలిచారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు జుబేర్, సురేష్, బిక్షపతి, అక్రమ్, విద్యార్థులు తదితరులు ఉన్నారు.