బంట్వారం, నవంబర్ 19 : పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు కోట్‌పల్లి పోలీస్‌లు బాధితులకు అందించారు. ఎస్ఐ శైలజ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలోని కోట్‌పల్లి మండల పరిధి బార్వాద్ గ్రామానికి చెందిన రాచిరెడ్డి గత అక్టోబర్‌లో తన వీవో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు.
అదే విధంగా ఎన్నారం గ్రామానికి చెందిన చాపల అనిల్‌కుమార్ తన వీవో ఫోన్‌ను అక్టోబర్‌లోనే పోగొట్టుకున్నట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాము సీఈఐఆర్ పోర్టల్ ద్వారా విచారించి, ట్రేసింగ్ చేసి పట్టుకున్నామన్నారు. వాటిని బాధిత ఫిర్యాదుదారులకు బుధవారం అందజేశామని చెప్పారు.