నర్సాపూర్, ఫిబ్రవరి13 : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడి భార్య పంబల లలిత బిక్షపతిని అదృష్టం వరించింది. మొదట రెండు రౌండ్లు పూర్తికాగానే అధికారులు మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. మూడో రౌండ్లో 15వ వార్డు ఓట్ల లెక్కింపు చేపట్టగా బీఆర్ఎస్ అభ్యర్థి లలిత భిక్షపతి, కాంగ్రెస్ అభ్యర్థి వంకమల్ల జ్యోతికి 258 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి.
రీకౌంటింగ్‌లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులకు సమాన ఓట్లు రావవడంతో విజేతను నిర్ణయించేందుకు సిబ్బంది లాటరీ తీశారు. లలిత భిక్షపతి, వంకమల్ల జ్యోతి పేర్లు రాసి చీటీ తీశారు. అందులో లలిత భిక్షపతి పేరు రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారని అధికారులు ప్రకటించారు. అదృష్టం వరించడంతో బీఆర్ఎస్ అభ్యర్థి అనందానికి అవధులు లేకుండా పోయాయి.