చేవెళ్లటౌన్, మే 3: కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు వరంలాంటిదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ప్రతి పేద ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాలకు చెందిన 42 మందిలబ్దిదారులకు కళ్యాణలక్షీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద వారికి కళ్యాణలక్షీ, షాదీ ముబారక్ ఎంతో అసరగా నిలుస్తుందన్నారు. 41 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు, ఒక షాదీ ముబారక్ చెక్కులతో మొత్తం 42 చెక్కులకు గాను రూ.42,04,872 లను పంపిణీ చేశామని తెలిపారు.
అదేవిధంగా 55మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.24,77,500 విలువైన ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల తహసిల్దార్ క్రిష్ణయ్య, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, ముడిమ్యాల సీఏసీఎస్ చైర్మన్ గోనే ప్రతాపు రెడ్డి, మాజీ సర్పంచ్లు బండారి ఆగిరెడ్డి, గోపాల్ రెడ్డి, రాజశేఖర్, టీపీపీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్లు గంగి యాదయ్య, టేకుల పల్లి శ్రీనివాస్ యాదవ్, డైరెక్టర్ జనార్ధన్, గుడిమల్కాపూర్ డైరెక్టర్లు పాండు యాదవ్,మొహన్ రెడ్డి, నాయకులు మహేందర్, రవిందర్ రెడ్డి, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.