వికారాబాద్, ఏప్రిల్ 30 : బసవేశ్వరుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి అని ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.మహాత్మా బసవేశ్వర జయంతి సందర్బంగా బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తాలోని బసవేశ్వరుడి విగ్రహానికి బీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమాజంలోని వర్ణ, వర్గ, లింగ వివక్షతపై బసవేశ్వరుడు ఆ రోజుల్లోనే పోరాడారని, సమ సమాజ స్థాపనకు కృషి చేశారని కొనియాడారు.
ఆయన బోధనలు, వచనాలు ఈ తరానికి ఎంతో అవసరమన్నారు. వికారాబాద్ జిల్లా ప్రజలకు అలాగే వీరశైవ లింగాయత్‌లకు బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, మాజీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు సురేష్, అశోక్, నర్సింహులు, పాండు, మల్లికార్జున్, గిరీష్, సుభాన్‌రెడ్డి, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.