వికారాబాద్, నవంబర్ 27 : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో మీడియా సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జనరల్ అబ్జర్వర్ షేక్ ఆష్మిన్ బాషా కలసి ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం పై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టడుతామని కలెక్టర్ తెలిపారు.
హెల్ప్‌లైన్ సెంటర్‌ను పరిశీలించారు. టీవీలో వివిధ ఛానల్స్ తో పాటు లోకల్ ఛానల్స్‌ను పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మనోహర రాజు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీపీఆర్ ఓ చెన్నమ్మ, ఉద్యానవన శాఖ అధికారి సత్తార్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్, జిల్లా పౌర సంబంధాల అధికారి, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.