కులకచర్ల : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కులకచర్ల ఎస్సై రమేశ్ అన్నారు. సోమవారం కులకచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
గ్రామాల్లో మూఢ నమ్మకాలను నమ్మవద్దని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనకు, బాలకార్మిక వ్యవస్థల నిర్మూలనకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిని అతిక్రమించిన వారికిపై చర్యలు ఉంటాయని చెప్పారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని అన్నారు. అంటరాని తనం నేరమని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ ఖాజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ భరత్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.