కొడంగల్, మే 31: భక్తిశ్రద్ధలతో గత 88 వారాలుగా హిందూ వాహిని సభ్యులతో పాటు స్థానిక భక్తులు కొడంగల్ శివారులోని శ్రీ సిద్ధినాం ఆంజనేయ స్వామి దేవాలయం లో ప్రతి శనివారం సామూహిక హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పారాయణం దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం 88వ వారం హనుమాన్ చాలీసా పారాయణాన్ని భక్తిశ్రద్ధతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఆంజనేయ స్వామి వారికి భక్తులు పంచామృతాలతో అభిషేకించి చందన లేపనం, ఆకు పూజ, అష్టోత్తర శతనామావళి వంటి కార్యక్రమాలను కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం సామూహిక హనుమాన్ చాలీసా పట్టణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పాల్గొన్న భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాన్ని వితరణ చేశారు.