బొంరాస్ పేట : దుద్యాల మండల పరిధిలోని హాకింపేట గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ శంకర్ నాయక్ ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాల ఏర్పాటుతో మండలంలోని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు 80 మంది విద్యార్థులు కళాశాలలో చేరడం చాలా సంతోషకరమని, కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి స్థానికులు మరింత కృషి చేయాలని కోరారు.
అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నరసింహారెడ్డి, అధ్యాపక బృందం, గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి, యుగంధర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.