కులకచర్ల, సెప్టెంబర్ 11 : యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. తాము వేసిన వరి పంటకు సకాలంలో యూరియా వేయక పోవడం వలన పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం నెల రోజుల నుండి ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల పెద్ద గేటు చౌరస్తాలో ధర్నా నిర్వహించిన రైతులు వాహనాలను ఆపివేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రతి రెండు రోజులకు ఒక సారి సగం లారీని మాత్రం తమ మండలానికి పంపిస్తే వేల ఎకరాల్లో వరిపంటను సాగుచేశామని డిమాండుకు తగ్గ ఎరువులు రాక పోవడంతోనే రైతులం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రైతులు ఆగ్రోసేవా కేంద్రాల దగ్గర, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కాని, ప్రజాప్రతినిధులు కాని వచ్చి రైతులకు ధైర్యాన్ని చెప్పలేక పోతున్నారని అన్నారు.
పరిగి ఎమ్మల్యె వెంటనే స్పందించి మండలానికి రైతులకు సరిపోను యూరియాను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వెంటనే కులకచర్ల ఎస్ఐ రమేశ్‌కుమార్ వారిసిబ్బందితో ధర్నా కార్యక్రమం దగ్గరకు వెళ్లీ రైతులకు యూరియా గురించి తెలియజేశారు. శుక్రవారం కులకచర్ల మండలానికి రెండు లారీల యూరియా వచ్చేవిందంగా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా నుండి విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు రాఘవేందర్‌గౌడ్, మహిపాల్‌తో పాటు వివిధ గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.