వికారాబాద్ : యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ యూరియాకు కొరత ఉంది. దాంతో రైతులు ఎరువుల దుకాణాల దగ్గర యూరియా కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది.
ఉదయాన్ని ఎరువుల దుకాణాలకు చేరుకుని చెప్పులు, ఆధార్‌కార్డులను క్యూలైన్లలో పెట్టి తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రైతులు అర్ధరాత్రి నుంచే ఎరువుల దుకాణాలకు చేరుకుంటున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కూడా రైతులు యూరియా కొనుగోలు కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.